: భారతీయుల పెండ్లి.. దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి చిక్కులు
దక్షిణాఫ్రికాలోని జాకబ్ జుమా ప్రభుత్వం ఇప్పుడో వివాదంలో చిక్కుకుంది. భారతీయుల పెండ్లి విషయంలో చట్టానికి అతీతంగా వ్యవహరించారనే ఆరోపణలను ఇప్పుడు ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అక్కడి ప్రెటోరియాలోని వాయుసేన స్థావరంలో ఈ మంగళవారం ఒక విమానం అనుమతి లేకుండా దిగింది. అందులో సంపన్న భారతీయ కుటుంబానికి చెందిన అతిధులు ఉన్నారు. వారంతా పెళ్లి వేడుకకు వచ్చినవారే.
ఆ సంపన్న కుటుంబం అధికార పార్టీ ఎఎన్ సి కి భారీగా విరాళాలు ఇస్తోంది కనుకనే అలా చూసీ చూడనట్లు వ్యవహరించారని దుమారం రేగింది. దీంతో వివరణ ఇచ్చుకోలేక అక్కడి ప్రభుత్వం సతమతమవుతోంది. ఇదే వ్యవహారంలో పలువురు మిలటరీ అధికారులను దక్షిణాఫ్రికా ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసి వ్యవహారాన్ని చల్లబర్చే ప్రయత్నం చేసింది.