: తన వారసుడిని మార్చేసిన సౌదీ కింగ్
సౌదీ రాజు సల్మాన్, తన కొత్త వారసుడిని ప్రకటించారు. తన కుమారుడు మహమ్మద్ బిన్ సల్మాన్ (31) పేరును తదుపరి రాజుగా ప్రకటిస్తూ, ఇటీవల తాను తొలగించిన యువరాజు మహమ్మద్ బిన్ నయీఫ్ నుంచి పూర్తి అధికారాలను లాగేసుకున్నారు. ఈ మేరకు రాయల్ డిక్రీని జారీ చేస్తూ, సల్మాన్ ను ఉప ప్రధానిగా ప్రకటిస్తున్నట్టు, రక్షణ శాఖ కూడా ఆయన అధీనంలో ఉంటుందని అధికార సౌదీ ప్రెస్ ఏజన్సీ నుంచి ఓ ప్రకటన వెలువడింది. బిన్ నయీఫ్ ను అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగానూ తొలగిస్తున్నట్టు రాజు ఈ డిక్రీలో ఆదేశించారు. సౌదీలో సగానికి పైగా జనాభా 25 సంవత్సరాల్లోపే ఉండటంతో, యువతకు బిన్ సల్మాన్ ప్రతినిధిగా వ్యవహరిస్తారని సౌదీ రాజు అభిప్రాయపడ్డారు.