: గంటా శ్రీనివాసరావు తన కుమారుడి ద్వారా కోరిక తీర్చుకుంటున్నారు: చిరంజీవి
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవి తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో అశోక్ కుమార్ నిర్మించిన 'జయదేవ్' సినిమాలో రవి హీరోగా పరిచయం అయ్యాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మోహన్ బాబు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, గంటా శ్రీనివాసరావుతో తనది రాజకీయాలకు అతీతమైన స్నేహమని చెప్పారు. అప్పట్లో ఆయనకున్న పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి రాలేకపోయారేమో... ఇప్పుడు కుమారుడి ద్వారా తన కోరికను గంటా తీర్చుకుంటున్నారని అన్నారు. కుమారుడు హీరో అయ్యాడన్న ఆనందం గంటాలో కనపడుతోందని అన్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ, 'స్వర్గం-నరకం' సినిమా టైమ్ లో తాను గంటా రవిలా లేనని చెప్పారు.