: జగన్ అన్న ఏదీ చెప్పనప్పుడు.. నేనెందుకు బాధ పడాలి?: వైసీపీ ఎంపీ బుట్టా రేణుక


కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుకకు ఈ సారి ఎంపీ టికెట్ దక్కదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై బుట్టా రేణుక స్పందిస్తూ, ఎంపీ కావాలనేదే తన కోరిక అని తెలిపారు. ఇంత వరకు తమ అధినేత జగన్ ఈ విషయంపై తనతో ఏమీ చెప్పలేదని అన్నారు. జగన్ అన్న ఏదీ చెప్పనప్పుడు... తాను ఎందుకు బాధ పడాలని ప్రశ్నించారు. జగన్ ఇప్పటి వరకు తన విషయంలో సంతోషంగానే ఉన్నారని చెప్పారు. రేపు ఏం జరుగుతుందనేది దేవుడికే తెలుసని అన్నారు.

జగన్ ను తాను ఎన్నో సార్లు కలుస్తుంటానని... ఆయన తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారని రేణుక చెప్పారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా సలహాలు ఇస్తుంటారని తెలిపారు. 'ఇంకొంచెం బలంగా ఉండాలమ్మా... వాయిస్ పెంచాలి' అని చెబుతుంటారని అన్నారు. ఒకరిని విమర్శించడం తన స్వభావం కాదని జగన్ అన్నతో చెప్పానని... తానే నేరుగా చెప్పిన తర్వాత ఆయన ఎందుకు ఒత్తిడి చేస్తారని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో అన్న తనను బాగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News