: మసాజ్ చేయించుకుని.. 'బాహుబలి-2' సినిమా చూసి. పోలీసుల్ని బురిడీ కొట్టించిన సాధ్వి మళ్లీ అరెస్టు


షాపింగ్ మాల్ లో మసాజ్ చేయించుకుని, 'బాహుబలి-2' సినిమా చూసి ఎస్కార్టు పోలీసులకు మస్కా కొట్టి పరారైన ఖైదీ సాధ్వి జయశ్రీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఛీటింగ్ కేసులో అరెస్టైన ఆమె ఈ నెల 10న అనారోగ్య కారణాలతో పెరోల్ పై బయటకు వచ్చింది. 14న పెరోల్ గడువు ముగిసింది. దీంతో పోలీసులు అమెను అరెస్టు చేసేందుకు రాగా, ఎస్కార్టు పోలీసులను ఒప్పించి, తన లాయర్ తో కలిసి ఒక షాపింగ్ మాల్ లోపలికి వెళ్లింది.

అక్కడ మసాజ్ చేయించుకుంటూ పెరోల్ పొడిగింపు కోసం చర్చలు జరిపింది.  'బాహుబలి-2' సినిమా కూడా చూసింది. అయితే  తనకు పెరోల్ రాదని గ్రహించి, బాత్రూమ్ కి వెళ్లి వస్తానని చెప్పి ఎస్కార్టు పోలీసుల కళ్ళుగప్పి పరారైంది. దీంతో ఆమె లాయర్, నలుగురు ఎస్కార్టు పోలీసులను అదుపులోకి తీసుకుని, గాలింపు చేపట్టగా, రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ సమీపంలోని ఒక టోల్ వద్ద ఆమె పట్టుబడింది. దీంతో ఆమెను గుజరాత్ కు తీసుకొస్తున్నారు. 

  • Loading...

More Telugu News