: సినీ నేపథ్యంలో లేకపోతే బాలీవుడ్ లో నెగ్గుకురావడం కష్టం: కృతి సనన్
బాలీవుడ్ లో నటిగా మంచి పేరుతెచ్చుకోవడం మామూలు విషయం కాదని సినీ నటి కృతి సనన్ తెలిపింది. ఆమె తాజాగా నటించిన రాబ్తా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి బాలీవుడ్ లో పేరు తెచ్చుకోవడం శక్తికిమించిన పని అని చెప్పింది. అదే సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని తెలిపింది.
అవకాశాలు రావాలంటే సినీ నేపథ్యంలో ఉంటే సులువవుతుందని చెప్పింది. అవకాశాలు వస్తే ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుందని చెప్పింది. సరైన గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నానని, ఇందుకు మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నానని ఆమె చెప్పింది. కష్టపడి పని చేస్తే ఇలాంటి అడ్డంకులను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదని ఆమె తెలిపింది. అభిమానుల ప్రోత్సాహం చాలా అవసరమని తెలిపింది. అభిమానుల ప్రోత్సాహం వల్లే రీ ఛార్జ్ అవుతుంటామని తెలిపింది.