: కోహ్లీ స్వయంగా ఫిర్యాదు చేశాడని తెలిసి ఆశ్చర్యపోయా: అనిల్ కుంబ్లే

తనపైన, తానిస్తున్న శిక్షణా విధానంపైన కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వయంగా ఫిర్యాదు చేశాడని తెలిసి ఆశ్చర్యపోయానని దిగ్గజ స్పిన్నర్, టీమిండియా కోచ్ పదవికి రాజీనామా ప్రకటించిన అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. తన పరిధిని ఎన్నడూ దాటలేదని చెప్పిన కుంబ్లే, జట్టులో క్రమశిక్షణ, అంకితభావం, నిజాయతీ వంటి విశిష్ట లక్షణాలను తీసుకు వచ్చానని, వీటికి విలువ ఇచ్చినప్పుడే బంధం నిలుస్తుందని అన్నాడు. తాను కొనసాగడం జట్టుకు ఇష్టం లేని వేళ, వైదొలగటమే మేలని అన్నాడు.

బీసీసీఐ తనతో మాట్లాడుతూ, ఈ ఫిర్యాదుల గురించి చెప్పిన క్షణమే రాజీనామాకు నిర్ణయించుకున్నానని కుంబ్లే వెల్లడించాడు. సంవత్సరం పాటు కోచ్ గా తాను పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, కుంబ్లే నిష్క్రమణను ధ్రువీకరించిన బీసీసీఐ, టెస్టుల్లో భారత జట్టు నంబర్ వన్ గా నిలవడం వెనుక ఆయన కృషి ఉందని, అందుకు అభినందనలని పేర్కొంది. కుంబ్లేకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News