: బిజినెస్ లో బిజీగా ఉండే ఎంపీ బుట్టా రేణుక రాజకీయాల్లోకి ఎలా వచ్చారంటే..!
కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చారు. నిరంతరం తమ బిజినెస్ పనుల్లో బిజీగా ఉండే ఆమె రాజకీయ అరంగేట్రం ఊహించని విధంగానే జరిగింది. రాజకీయాల్లోకి ఆమె ప్రవేశించడానికి ప్రధాన కారణం ఆమె భర్తే. ఆయనతో పాటు ఆమె సోదరుడు యుగేందర్ కూడా ఆమెను రాజకీయాల దిశగా ప్రోత్సహించారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బిజినెస్ లో బిజీగా ఉండటం వల్ల, తమకు రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి ఉండేది కాదని చెప్పారు. విద్య, రీటైల్, ఆటోమొబైల్ బిజినెస్ లను తమ కుటుంబం నిర్వహిస్తోందని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ కొత్త అభ్యర్థుల కోసం చూస్తున్న సమయంలో, తన భర్తకు ఆఫర్ వచ్చిందని చెప్పారు. అయితే, నాకంటే నీవే రాజకీయాల్లో బెస్ట్ అంటూ తన భర్త తనను ప్రోత్సహించారని తెలిపారు. ఆ తర్వాత వైసీపీలో చేరడం, ఎంపీ కావడం జరిగిపోయాయని చెప్పారు.