: నా తల్లిదండ్రులకు ద్రోహం తలపెట్టేలా వ్యవహరించి, చాలా తప్పు చేశా: కన్నడ నటుడు హుచ్చా వెంకట్


ప్రియురాలి ప్రేమ కోసం కన్నడ సినీ నటుడు హుచ్చా వెంకట్ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ఆయన మాట్లాడుతూ, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ద్రోహం తలపెట్టేలా తాను వ్యవహరించి, చాలా పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనను ప్రేమించిన నటి రచన... వివాహానికి ఒప్పుకోకపోవడంతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పాడు.

తను ప్రేమలో పడటానికి ఆమే కారణమని, ఆమె ప్రోద్బలంతోనే తాను ప్రేమలో పడ్డానని వెంకట్ తెలిపాడు. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆమే తనతో పరిచయం పెంచుకుందని, తనతో సెల్ఫీ తీసుకుని స్నేహం చేసిందని చెప్పాడు. తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత రెండేళ్ల అనంతరం పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాట ఇచ్చానని... ఆ తర్వాత వివాహం చేసుకుందామని తాను అడిగితే, ఆమె ఒప్పుకోలేదని చెప్పాడు. దీంతో, తనకు జీవితంపై విరక్తి కలిగిందని, ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News