: నా రాజీనామాకు కారణమిదే: కుంబ్లే


భారత లెజండరీ స్పిన్నర్ గా దాదాపు 17 సంవత్సరాలు సేవలందించి, గత సంవత్సరం టీమిండియా కోచ్ గా నియమితుడైన అనిల్ కుంబ్లే, నిన్న అనూహ్యంగా తన బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తన కోచింగ్‌ శైలిపై కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభ్యంతరాలున్నాయి కాబట్టే నిష్క్రమిస్తున్నానని కుంబ్లే స్పష్టం చేశాడు. విభేదాలున్న నేపథ్యంలో కోచ్ గా కొనసాగే ఉద్దేశం తనకు లేదని అన్నాడు.

 ఆపై ఓ ప్రకటన విడుదల చేస్తూ, కోచ్ గా కొనసాగాలని బీసీసీఐ సలహా కమిటీ కోరడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపాడు. గత ఏడాది కాలంగా భారత జట్టు సాధించిన విజయాలు కెప్టెన్ సహా జట్టు మొత్తానికీ దక్కుతుందని అన్నాడు. తానెప్పుడూ భారత క్రికెట్ కు శ్రేయోభిలాషినేనని తెలిపాడు. భారత క్రికెట్ కు అనుక్షణం అండగా నిలిచే ప్రతి అభిమానికీ కృతజ్ఞతలు చెప్పాడు అనిల్ కుంబ్లే.

  • Loading...

More Telugu News