: పేరుకు బొమ్మ తుపాకులు... తెచ్చేది గన్స్... ముంబైలో ఆయుధాల స్మగ్లింగ్ బట్టబయలు


పేరుకు టర్కీ నుంచి టాయ్ గన్స్ ఇంపోర్ట్... తెచ్చేది మాత్రం అసలైన తుపాకులు... ఇప్పటివరకూ ఎనిమిది సార్లు విజయవంతంగా తుపాకులను దిగుమతి చేసుకున్నారు. తొమ్మిదోసారి మాత్రం ముంబై పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఈ ఆయుధాల స్మగ్లింగ్ ను బట్టబయలు దేశారు. లూథియానా కేంద్రంగా నడుస్తున్న ఎయిర్ సాప్ట్ గన్ ఇండియా అనే సంస్థ టర్కీ నుంచి 'అరల్' బ్రాండు బొమ్మ తుపాకులను దిగుమతి చేసుకుంటోంది.

అయితే, బొమ్మ తుపాకుల పేరిట అసలు తుపాకులను ఈ సంస్థ ఇంపోర్ట్ చేస్తోందని గుర్తించిన విజిలెన్స్ అధికారులు ముంబై కార్గో కాంప్లెక్స్ పై దాడి చేసి వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువైన 200 తుపాకులను సీజ్ చేశారు. టర్కీ నుంచి తెప్పించిన వీటిని మార్కెట్ లో అక్రమంగా విక్రయిస్తున్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో దిగుమతిదారు, ఏజెంటును అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News