: బ్యూటీషియన్ శిరీష్ ఆత్మహత్య కేసులో ట్విస్టు ఇచ్చేవి ఈ రెండు విషయాలే!


హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో అంశం బట్టబయలవుతోంది. తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్టులోని అంశాలు ఈ కేసులో కొత్తట్విస్టుకు కారణమవుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో శిరీష పింక్ ప్యాంటీ వేసుకుందని, దానిపై మరకలున్నాయని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగిందా? అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు.

అలాగే తాజాగా బయటపడ్డ శిరీష ఫోన్ రికార్డింగుల్లో నందు, నవీన్ అన్న పేర్లు వెల్లడయ్యాయి. వారెవరు? అన్న విషయాలు కూడా ఆరాతీస్తున్నారు. అలాగే తేజస్వినిని శిరీష తన ఎనిమీగా పేర్కొంది. అలాంటప్పుడు ఆమెపై ప్రతీకారం తీర్చుకోకుండా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది? అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తోంది. దీంతో ఈ కేసులో నందు, నవీన్ లు ఎవరన్న విషయంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్టు కీలకం కానుంది. ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా అన్న విషయంపై క్లారిటీ వస్తే సగం చిక్కుముడులు వీడుతాయని పోలీసులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News