: బీదర్ లో బంపర్ ఆఫర్...కేవలం 10 పైసలకే చీర!
బీదర్ లో బంపర్ ఆఫర్ ను ఒక షాపింగ్ మాల్ ప్రకటించింది. దాని వివరాల్లోకి వెళ్తే...కర్ణాటక, బీదర్ లోని ‘సృష్టి దృష్టి’ షాపింగ్ మాల్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో 350 రూపాయల విలువ చేసే చీరను కేవలం 10 పైసలకే విక్రయించనున్నట్లు ‘సృష్టి దృష్టి’ మాల్ ప్రకటించింది. రంజాన్ ను పురస్కరించుకుని ప్రవేశపెట్టిన ఈ బంపర్ ఆఫర్ ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఒక్కో మహిళకు ఒక చీరను మాత్రమే విక్రయించనున్నామని షాపింగ్ మాల్ తెలిపింది. ఈ చీరల కొనుగోలుకు కేవలం 10, 20, 50 పైసల నాణేలతోనే రావాలని, అలా వచ్చినవారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ‘సృష్టి దృష్టి’ షాపింగ్ మాల్ యాజమాన్యం స్పష్టం చేసింది.