: సీఆర్పీఎఫ్ శిబిరంపై ‘ఉగ్ర’ దాడి!
దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని త్రాల్ లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ 180వ బెటాలియన్ శిబిరంపై ఉగ్రవాదులు రెండు గ్రెనేడ్లు విసిరారు. అనంతరం, భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఇదిలా ఉండగా,శ్రీనగర్ లో 4 గ్రెనేడ్లు, 2 మ్యాగజైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.