: ఎన్డీఏ అభ్యర్థికే మా మద్దతు!: ప్రకటించిన శివసేన


త‌మ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ.. రామ్‌నాథ్‌ కోవింద్‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపే అంశంపై ఈ రోజు శివసేన పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... తాము ఎన్డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నామ‌ని అన్నారు. పార్టీలో అంద‌రితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. బీజేపీకి శివసేన పార్టీ మిత్ర‌పక్షమే అయిన‌ప్ప‌టికీ కొంత కాలంగా ఇరు పార్టీల నేతలు ఒక‌రిపై ఒక‌రు కారాలు-మిరియాలు నూరుకుంటున్నారు. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలోనూ  ఉద్దవ్‌ ఠాక్రే బీజేపీపై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. చివరికి ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News