: రాష్ట్ర పరిస్థితులపై స్పందించేందుకు పవన్ కల్యాణ్ కి సమయం దొరకడం లేదు!: వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్టుని పట్టుకుని ప్రజలముందుకు రావడమే పవన్ కల్యాణ్ తన పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు, అన్యాయాలు ఎన్ని జరుగుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి లేకపోయినా పవన్ కల్యాణ్‌కి స్పందించే సమయం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పిందే చేస్తాననే రీతిలో పవన్ కల్యాణ్ తీరు ఉందని వ్యాఖ్యానించారు.