: కోయంబత్తూరులో జస్టిస్ కర్ణన్ అరెస్టు!


సుప్రీంకోర్టు జడ్జిలపై అవినీతి ఆరోపణలు చేసిన కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఆయన్ని అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలు చేసిన కర్ణన్ ను అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నాటి నుంచి ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. మే 9వ తేదీ నుంచి అజ్ఞాతంలో ఉన్న కర్ణన్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి, కోల్ కతాకు తరలిస్తున్నారు. కాగా, జస్టిస్ కర్ణన్ పదవీ కాలం ఆయన అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే పూర్తయింది.

  • Loading...

More Telugu News