: టీమిండియా హెడ్ కోచ్ పదవికి కుంబ్లే గుడ్ బై!


ఛాంపియన్స్ ట్రోఫీలో పరాజయం  నుంచి కోలుకోక ముందే టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లే గుడ్ బై చెప్పారు. హెడ్ కోచ్ గా కుంబ్లే ఏడాది పదవీ కాలం నేటితో  పూర్తవుతోంది. కోచ్ గా కొనసాగడం తనకు ఇష్టం లేదంటూ పదవి నుంచి కుంబ్లే తప్పుకున్నారు. లండన్ నుంచి కోహ్లీ సేన విండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఐసీసీ సమావేశం నిమిత్తం కుంబ్లే అక్కడే ఉండిపోయారు.

కాగా, కొంతకాలంగా కుంబ్లే, కోహ్లీ మధ్య విభేదాలు తలెత్తినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. బీసీసీఐ పాలకుల కమిటీ, గంగూలి, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ తో కూడిన క్రికెట్ సలహా సంఘం కలసి వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించింది. ఇదిలా ఉండగా, లిమిటెడ్ ఓవర్ల సిరీస్ నిమిత్తం ఈ నెల 23న వెస్టిండీస్ తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో కోచ్ లేకుండానే టీమిండియా వెస్టిండీస్ వెళ్లింది.

  • Loading...

More Telugu News