: ధోనీ, యువరాజ్‌సింగ్‌లపై ఎప్పుడు వేటు వేస్తారు?: రాహుల్‌ ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు


ఎంఎస్‌ ధోనీ, యువరాజ్‌సింగ్‌ల‌ను టీమిండియాలో కొనసాగించే విషయమై సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భార‌త మాజీ ఆట‌గాడు ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... వ‌చ్చే వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరి ఆట‌గాళ్ల‌ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. సెలెక్టర్ల దృష్టిలో భారత్‌ క్రికెట్‌కు రోడ్‌మ్యాప్‌ ఏమిటని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇద్దరికి టీమిండియాలో స్థానం ఉందా? అని అడిగిన ఆయ‌న... ఈ విషయాన్ని సమీక్షించడానికి ఎంత సమయం తీసుకుంటారని నిల‌దీశారు. ధోనీ, యువీల‌ను అలాగే ఆడనిస్తారా? ఎంతోమంది ప్రతిభావంతులు అందుబాటులో ఉన్నారు క‌దా? అని ఆయ‌న ముక్కుసూటిగా మాట్లాడారు. ధోనీ, యువీలు కొన్నాళ్లుగా క్రికెట్ లో రాణించలేకపోతున్న విషయం తెలిసిందే.  

  • Loading...

More Telugu News