: ఐవైఆర్ కు చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నది అబద్ధం: యనమల రామకృష్ణుడు
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఫేస్ బుక్’ పోస్ట్ లు చేసిన ఐవైఆర్ కృష్ణారావు ను బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కు ఎక్కువ నిధులు కేటాయించాలని కృష్ణారావు కోరారని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి రీత్యా సాధ్యం కాదని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ లో ప్రత్యేకంగా ఓ సొసైటీ ని ఏర్పాటు చేయాలని కృష్ణారావు ప్రయత్నించారని, అందుకు, తాము అంగీకరించలేదని చెప్పారు. సీఎం చంద్రబాబు తనకు ఆరు నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఐవైఆర్ చేసిన ఆరోపణలను యనమల కొట్టిపారేశారు.