: త‌మ‌కు అనుకూల‌మైన ఛానెల్స్ ప్రసారాలను మాత్ర‌మే అనుమతించాలని ప్ర‌భుత్వం యోచిస్తోంది: ఉండ‌వ‌ల్లి


కేబుల్ నెట్‌వ‌ర్క్‌ను గుప్పెట్లో పెట్టుకుని త‌మ‌కు అనుకూల‌మైన ఛానెల్స్ ప్రసారాలను మాత్ర‌మే అనుమతించాలని ప్ర‌భుత్వం యోచిస్తోందని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. ఏపీ ఫైబ‌ర్ నెట్ లిమిటెడ్‌ను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారని ప్ర‌శ్నిస్తూ ఈ రోజు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ఉండవల్లి లేఖ రాశారు. 149 రూపాయ‌ల‌కే ఇచ్చే కేబుల్‌లో మ‌న‌కు ఇష్టం వ‌చ్చిన ఛానెళ్లు ఉండ‌వని, ప్ర‌భుత్వానికి ఇష్టం వ‌చ్చిన ఛానెళ్లు మాత్రమే ఉంటాయని ఆరోపించారు. అలాగే ల‌క్ష‌లాది మంది కేబుల్ టీవీ ఆప‌రేట‌ర్ల ఉపాధిని దెబ్బ‌తీయ‌కూడ‌దని ఆయ‌న అన్నారు. ఈ విధానాన్ని తాను వ్య‌తిరేకిస్తున్నాన‌ని చెప్పారు. 

  • Loading...

More Telugu News