: కాంగ్రెస్ సీనియర్ నేతలిద్దరికీ బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం కేసీఆర్


టీ-కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లది ఒకే రోజు పుట్టినరోజు కావడంతో సీఎం కేసీఆర్ వారికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఫోన్ ద్వారా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారికి పుష్పగుఛ్చాలను పంపారు. ప్రజలకు మరిన్ని సేవలందించేలా భగవంతుని ఆశీస్సులు వారికి ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించారు. 

  • Loading...

More Telugu News