: వాట్సప్ కంటే ముందే ఆ ఫీచర్ ను తీసుకొచ్చిన మెసేజింగ్ యాప్ 'హైక్'!


 ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కు భార‌త్‌ లో పోటీనిస్తోన్న హైక్ త‌మ వినియోగ‌దారుల ముందుకు మ‌రో ఫీచ‌ర్‌తో వ‌చ్చింది. తమ హైక్ లో నగదు బ‌దిలీ, మొబైల్ బిల్స్ చెల్లించడం, రీఛార్జ్ చేసుకోవడం వంటి ఫీచ‌ర్లు తీసుకొచ్చిన‌ట్లు ఆ కంపెనీ ప్ర‌తినిధులు చెప్పారు. యస్ బ్యాంక్ సాయంతో తాము వాలెట్ ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. యూపీఐ ద్వారా త‌మ యూజ‌ర్లు ఓ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు ట్రాన్స్ ఫర్లు చేసుకోవచ్చని చెప్పారు. భారత్ లో వాట్స‌ప్ కూడా ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌నుంది.  మెసేజింగ్ ప్లాట్ ఫామ్ ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చిన తొలి యాప్ తమదేనని హైక్ ప్ర‌తినిధులు చెప్పారు. ఈ ఫీచ‌ర్‌తోనే కాక‌  యాప్ కెమెరాకు కొత్త ఫీచర్లను యాడ్ చేశామ‌ని అన్నారు. త‌మ‌కు ప్ర‌స్తుతం 100 మిలియన్లకు పైగా యూజ‌ర్లు ఉన్నార‌ని చెప్పారు. 

  • Loading...

More Telugu News