: స్నేహితుడితో నటి శోభన వివాహం?
ప్రముఖ నృత్యకారిణి, నాటి నటి శోభన తన స్నేహితుడిని వివాహం చేసుకోబోతున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తపై శోభన, ఆమె కుటుంబసభ్యులెవ్వరూ ఇంతవరకూ స్పందించలేదు. శోభన పెళ్లి చేసుకోనున్న వ్యక్తి ఆమె కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తేనని సమాచారం. కాగా, ప్రస్తుతం శోభన వయసు 47 ఏళ్లు. నాలుగు భాషల్లో ఆమె సుమారు 200 చిత్రాలకు పైగా నటించింది. తన జీవితాన్ని నృత్యానికే అంకితం చేసిన శోభన, 2001లో ఓ అమ్మాయిని దత్తత తీసుకుని.. ఆ చిన్నారికి అనంత నారాయణి అని పేరు పెట్టింది. శోభన నటించిన చివరి చిత్రం 2013లో తమిళంలో విడుదలైన ‘థిర’. 2006లో భారత ప్రభుత్వం తరపున పద్మశీ పురస్కారాన్ని ఆమె అందుకుంది.