: చంద్రబాబును లగడపాటి కలిస్తే తప్పులేనిది.. నేను వైసీపీ ఎమ్మెల్యేను కలిస్తే తప్పా?: ఐవైఆర్ కృష్ణారావు
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిశానంటూ విమర్శిస్తున్నారని... చంద్రబాబుతో లగడపాటి భేటీ అయితే తప్పులేనిది, వైసీపీ ఎమ్మెల్యేని తాను కలిస్తే తప్పేంటని ఐవైఆర్ ప్రశ్నించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ తో రాజకీయపరంగా ఎలాంటి ప్రయోజనం లేదని కొందరంటున్నారని... బ్రాహ్మణ వర్గాన్ని మొత్తం తీసుకెళ్లి టీడీపీకి అంకితం చేయాలా? అని ప్రశ్నించారు. తాను భజనపరుడిని కాదని చెప్పారు.