: తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న యాంకర్ శ్రీముఖి
తన అందంతో, మాటకారి తనంతో తెలుగు బుల్లితెరపై అదరగొడుతూ మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి ఓ టీవీ షో ప్రోగ్రాంలో తన తండ్రి మాటలు వినగానే తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది. మొన్న ఫాదర్స్ డే సందర్భంగా ఆ ప్రోగ్రాంలో తండ్రుల గురించి మాట్లాడుతున్నారు. పలువురు సీరియల్ యాక్టర్లు తమ కుమారులు, కూతుళ్లతో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరూ తమ తండ్రుల గురించి చెబుతున్నారు.
ఈ సందర్భంగా శ్రీముఖి తనకు తండ్రితో కన్నా తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉందని వ్యాఖ్యానించింది. అయితే, ఆ షో నిర్వాహకులు శ్రీముఖి తండ్రితో తీసుకున్న బైట్ ను ఆ సమయంలో ప్లే చేశారు. దీంతో శ్రీముఖి సర్ ప్రైజ్ అయింది. శ్రీముఖి తండ్రి ఆ వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ... అందరూ తనతో తన కూతురి గురించే చెబుతారని, అలాంటి కూతురు పుట్టడం తనకు గర్వకారణమని అన్నారు. తన గురించి తన తండ్రి అలా చెబుతోంటే శ్రీముఖి ఆ భావోద్వేగాన్ని అపుకోలేక ఏడ్చేసింది. ఈ సీన్ ను టీవీలో ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా ప్రసారం చేశారు.