: పూర్తిగా సన్నబడ్డ పవన్ కల్యాణ్
ఫిజిక్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' సినిమాలో చాలా లావుగా కనిపించారు. ఆ సినిమాలో పవన్ కొంచెం డీగ్లామర్ గానే కనిపించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కొత్త సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం కోసం పవన్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. బరువు తగ్గేందుకు అన్నం తినడం పూర్తిగా మానేశారు. క్యాలరీ ఫుడ్ కు కూడా దూరమయ్యారట. దీంతో, పవన్ నాజూగ్గా, అందంగా తయారయ్యారు.