: మూడేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడిన హీరో రాంచరణ్!


హీరో రాంచరణ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. ధనుష్ అనే మూడేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రాంచరణ్ కొత్త చిత్రం 'రంగస్థలం' షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఓ గ్రామానికి చెందిన కుటుంబం చరణ్ ను కలిసింది. తమ కుమారుడు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని చెర్రీతో ఆ చిన్నారి తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. పిల్లవాడి పరిస్థితిని చూసి చలించిపోయిన చరణ్... వైద్య చికిత్సకు ఏర్పాటు చేయాలంటూ తన బృందానికి తెలిపాడు.

ఈ నేపథ్యంలో ధనుష్ కు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స జరిగింది. చికిత్సకు అయిన ఖర్చంతా చరణే భరించాడు. ప్రస్తుతం ధనుష్ ఆరోగ్యంగా ఉన్నాడట. ఈ సందర్భంగా ధనుష్ తల్లిదండ్రులు చెర్రీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ధనుష్ ఆరోగ్యం పట్ల చెర్రీ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు ధనుష్ ను ఎత్తుకుని ముద్దాడాడు.

  • Loading...

More Telugu News