: ‘డీజే’ సినిమాను వదలని వివాదాలు... హైకోర్టులో బ్రాహ్మణ సంఘాల పిటిషన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ‘డీజే: దువ్వాడ జగన్నాథం’ విడుదలకు సిద్ధమయినప్పటికీ దానికి వివాదాలు వీడడం లేదు. ఆ సినిమాలోని ‘గుడిలో బడిలో ఒడిలో మడిలో’ అంటూ సాగే పాటపై ఉపయోగించిన అగ్రహారం, తమలపాకు, నమకం, చమకం వంటి పలు పదాలపై బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు హరీశ్ శంకర్ వివాదాస్పద పదాలను తీసేస్తామని కూడా ప్రకటించారు. అయితే, ఈ రోజు బ్రాహ్మణ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. డీజే సినిమాలో బ్రాహ్మణుల మనోభావాలను కించపరచేలా సన్నివేశాలు, పాటలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాల సభ్యులు పేర్కొంటూ పిటిషన్ వేశారు.