: ఆరు నెలలుగా సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాను.. ఇవ్వడం లేదు!: ఐవైఆర్ కృష్ణారావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐవైఆర్ కృష్ణారావు ఫేస్బుక్లో చేసి పోస్టులు కలకలం రేపిన విషయం తెలిసిందే. తాను అలా ఎందుకు ఆ పోస్టులు చేయవలసి వచ్చిందనే అంశంపై కృష్ణారావు వివరణ ఇచ్చారు. తాను విధి నిర్వహణ నిమిత్తం పలు విషయాలు చర్చించడానికి ఆరు నెలల నుంచి సీఎంని కలవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు అది కుదరలేదని అన్నారు. దీంతో తన ఈగో బాగా హర్ట్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. తాను బ్రాహ్మణ కార్పోరేషన్ పదవిని కావాలనే అడిగి తీసుసుకున్నానని అన్నారు. తన విధిని తాను సక్రమంగా నిర్వర్తించే క్రమంలో తనకు కనీసం ఐదు నిమిషాల అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం కుదరకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.
తాను జవాబుదారీ తనంతో వ్యవహరించడం లేదని కొందరు విమర్శిస్తున్నారని, అది చాలా తప్పని, తాను అన్నిటికీ జవాబుదారి గానే వ్యవహరిస్తున్నానని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. తనకు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు కానీ, ఇంతవరకు ప్రభుత్వం తనను తన పోస్ట్ లపై వివరణ అడగలేదని చెప్పారు. దీంతో తన ఈగో మరింత హర్ట్ అయిందని అన్నారు. తన మీద ఎన్నో అభాండాలు వేశారని అన్నారు.