: నా కొడుకు స్టేజీపై నిలబడి అలా చేస్తాడని అనుకోలేదు.. షాకయ్యాను: అల్లు అర్జున్
డీజే ఆడియో ఫంక్షన్‌లో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ స్టేజీపై చేతులెత్తి అందరికీ దండం పెట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకున్న బన్ని.. తన కొడుకు స్టేజీపై నిలబడి అలా చేస్తాడని అనుకోలేదని.. అది చూసి తాను షాకయ్యానని అన్నాడు. తనకు శివుడు అంటే ఇష్టమని, అందుకే తన బిడ్డలకు ఆయన పేరు కలిసి వచ్చే పేర్లు పెట్టుకున్నానని చెప్పాడు. శివుడు ఓ పవర్ ఫుల్ గాడ్ అని బన్ని అన్నాడు. డీజే సినిమాలో తనకు తండ్రిగా తనికెళ్ల భరణి నటిస్తున్నారని అల్లు అర్జున్ అన్నాడు. తన సినిమాల్లో ఆయనే అధికంగా ఫాదర్‌గా నటిస్తున్నారని, ఆయన ఎంత మేధావో అంత సరదాగా కూడా ఉంటారని అన్నాడు.