: వేమూరి ఆనందసూర్యకు బ్రాహ్మణ కార్పొరేషన్ బాధ్యతలు!
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటు ఖాయమైన నేపథ్యంలో, ఆ పదవికి వేమూరి ఆనందసూర్యను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన పలు పోస్టులను కృష్ణారావు షేర్ చేసుకోవడంతో మొదలైన రగడపై సీఎం చంద్రబాబు సీరియస్ అయి, ఆయన్ను వెంటనే తొలగించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ఉత్తర్వులు వెలువడకపోయినప్పటికీ, తదుపరి బాధ్యతలను పార్టీలో బ్రాహ్మణ వర్గానికి కీలక నేతగా, గతంలో పలు హోదాల్లో పదవులు నిర్వహించి, బ్రాహ్మణ సమాఖ్యను నిర్వహిస్తున్న ఆనందసూర్య పేరును చంద్రబాబు ఖరారు చేసినట్టు సమాచారం.