: ఐవైఆర్ కృష్ణారావు అంశంపై నారా లోకేష్ స్పందన


ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో, ఆయనను ఛైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు సర్వం సిద్ధమైనట్టు సమాచారం. ఆయనను పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై, మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఐవైఆర్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయని, ఈ అంశంపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమని చెప్పారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని తెలిపారు. 

  • Loading...

More Telugu News