: పాక్ తో సంబంధం లేకుండా ఆఫ్గన్ తో ఎయిర్ కారిడార్... తొలి కార్గోలో కాబూల్ నుంచి భారత్ కు 60 టన్నుల ఇంగువ!


పాకిస్థాన్ తో ఎటువంటి సంబంధం లేకుండా, ఆ దేశంలోని రోడ్లను వాడకుండా ఆఫ్గనిస్థాన్ తో వ్యాపార బంధాన్ని పెంచుకునే దిశగా, భారత్ కీలక అడుగులు వేసింది. ఇరు దేశాల మధ్యా ఎయిర్ కార్గో సేవలు ప్రారంభం కాగా, తొలి విమానంలో కాబూల్ నుంచి బయలుదేరిన ఓ రవాణా విమానంలో 60 టన్నుల ఇంగువ భారత్ కు రాగా, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విమానానికి స్వాగతం పలికారు. దీని విలువ 6 మిలియన్ డాలర్లు కాగా, ఇకపై రెండు దేశాల మధ్యా మరిన్ని రవాణా విమానాలు తిరుగుతాయని ఈ సందర్భంగా సుష్మ వ్యాఖ్యానించారు.

పాక్ తో సరిహద్దు విభేదాలు, తమ దేశం మీదుగా సరకు రవాణాకు పాక్ కల్పిస్తున్న ఆటంకాలు తదితరాల నేపథ్యంలో ఎయిర్ కార్గోకు పెద్ద పీట వేయాలని ఆఫ్గన్, భారత్ లు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే మూడేళ్లలో ఇరు దేశాల మధ్యా వాణిజ్యం 800 మిలియన్ డాలర్ల నుంచి బిలియన్ డాలర్ల వరకూ పెరుగుతుందని తెలిపారు. కాగా, ఇరు దేశాల మధ్యా ఎయిర్ కారిడార్ ఆలోచనను గత సంవత్సరం సప్టెంబర్ లో ఆఫ్గన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ స్వయంగా మోదీతో పంచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News