: మీడియా ముందుకు ఐవైఆర్ కృష్ణారావు.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్!
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటు వేసేందుకు సర్వం సిద్ధమైంది. చంద్రబాబుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో... ఆయనపై ప్రభుత్వం కన్నెర్ర జేసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయనను పదవి నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, ఈ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాను చేసిన పనికి ఐవైఆర్ వివరణ ఇచ్చుకోనున్నారు.