: ఖరీదైన కారును కొనుగోలు చేసిన రాజమౌళి
'బాహుబలి' సినిమాతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించినప్పటికీ, రాజమౌళి చాలా సింపుల్ గా ఉంటాడు. ఇప్పటి వరకు ఆయన ఓ అపార్ట్ మెంట్ లోనే ఉన్నారంటే నమ్మశక్యం కాదు. అంతేకాదు, ఆయన వాడే కారు కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది. పలు సందర్భాల్లో షూటింగ్ లొకేషన్ కు క్యాబ్ లోనే ఆయన వెళ్లాడు.
ఈ నేపథ్యంలో, జక్కన్న కొంచెం రూట్ మార్చాడు. తొలిసారి ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. దాదాపు కోటిన్నర రూపాయల విలువైన బీఎండబ్ల్యూ-7సిరీస్ కారును జక్కన్న కొన్నాడు. 'బాహుబలి' లాభాల్లో వాటాల రూపంలో రాజమౌళికి భారీ మొత్తమే అందింది. అంతేకాదు, ఆయన కుమారుడు కార్తికేయ ఈ సినిమాను కొన్ని ఏరియాలకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాడు.