: తన అధికారాన్ని బయటకు తీసిన తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు... ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణకు ఆదేశం!
తమిళనాడు రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు, తన చేతుల్లోని విశిష్ట అధికారాలకు పని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆయన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విపక్ష నేత స్టాలిన్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపి, తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర స్పీకర్, చీఫ్ సెక్రటరీలను విద్యాసాగర్ రావు ఆదేశించారు. కాగా, దాదాపు రూ. 1000 కోట్లను ఎమ్మెల్యేలకు చెల్లించిన శశికళ, వారిని తన అదుపులోనే ఉంచుకున్నారని ఇటీవల ఓ స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టించగా, విచారణకు ఆదేశించాలని అటు పన్నీర్ వర్గంతో పాటు డీఎంకే సైతం డిమాండ్ చేసింది. అధికార పార్టీ నేతలు మాత్రం, ఈ ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు.