: జియోకు షాక్.. కేవలం 18 శాతం మందే జియోను మొదటి సిమ్‌గా ఉపయోగిస్తున్నారట!


రిలయన్స్ జియోకు ఇది నిరాశ కలిగించే వార్తే. జియో వినియోగదారుల్లో కేవలం 18 శాతం మందే సిమ్‌ను మొదటి సిమ్‌గా ఉపయోగిస్తుండగా 82 శాతం మంది రెండో సిమ్‌గా ఉపయోగిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ వెలోసిటీ ఎంఆర్ పేర్కొంది. 86 శాతం మంది ఖాతాదారులు జియోను కొనసాగించడానికి కారణం ఉచిత ఆఫరేనని వెలోసిటీ పేర్కొంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సర్వేలో పాల్గొన్న చాలామంది జియో కాల్ రేట్లు, డేటా ప్యాకేజీలు, ఇంటర్నెట్ స్పీడ్ ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో 2 వేల మందిపై వెలోసిటీ సర్వే నిర్వహించింది. ఇక కాల్‌ డ్రాప్స్ విషయంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంటే మెరుగైన స్థానంలో జియో నిలిచింది.  అవి వరుసగా 56, 57, 57, 59 శాతంతో ఉండగా జియో 54 శాతం కాల్ డ్రాప్స్ నమోదు చేసింది.

  • Loading...

More Telugu News