: ‘నా ఫేవరెట్ ఫుడ్ పిజ్జా, పావ్ భాజీ, పానీ పూరీ’.. పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ముచ్చటించిన కాజల్
'లక్ష్మీ కల్యాణం' సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి మగధీర సినిమాలో నటించి టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తన అభిమానులతో ట్విట్టర్ లో ముచ్చటించింది. వారు అడుగుతున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పింది. సినిమాల్లోకి రాకపోతే మీరు ఏం చేసేవారని ఒక అభిమాని ఆమెను అడగగా.. వ్యోమగామిని అయ్యేదానినని కాజల్ సమాధానం ఇచ్చింది. ఈ మధ్య కాలంలో నచ్చిన సినిమాలు ఏంటని మరొకరు అడగగా కొత్త నటులు విజయ్, రితు వర్మలు నటించిన 'పెళ్లి చూపులు' అని పేర్కొంది.
మీకు ఎన్ని భాషలు వస్తాయని ఓ అభిమాని అడగగా, తనకు తెలుగు, తమిళం, హిందీ, మరాఠి, ఇంగ్లిష్ భాషలు వస్తాయని కాజల్ సమాధానం ఇచ్చింది. తన ఫేవరెట్ ఫుడ్ పిజ్జా, పావ్ భజ్జీ, పానీ పూరీ అని మరో అభిమానికి తెలిపింది. మీకు వంటలు చేయడం వచ్చా? అని ఒక నెటిజన్ అడడగా 'వచ్చు, నేను అద్భుతంగా వండుతా'నని తెలిపింది. రేపు నా పుట్టిన రోజు అని ఒక అభిమాని చెప్పగా.. హ్యాపీ బర్త్ డే అని కాజల్ విష్ చేసింది.