: వివాదరహితుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం: వెంకయ్యనాయుడు
ప్రతిపక్షాల సూచనల మేరకే నిజాయతీపరుడు, విద్యావంతుడు, వివాదరహితుడు అయిన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతిపక్షాల సూచనల మేరకు ఎంపికైన రామ్ నాథ్ కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు ప్రతిపక్షాలు కలసిరావాలని కోరారు.