: ఈ నెల 26 నుంచే రానా టీవీ షో ప్రారంభం.. మొదటి ఎపిసోడ్ లో అతిథులుగా టాలీవుడ్ యంగ్ నటులు


బాహుబ‌లి, ఘాజీ సినిమాల్లో అద‌ర‌గొట్టిన దగ్గుబాటి రానా జెమిని టీవీలో 'నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా' షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించనున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రోగ్రాం ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవ‌లే యూరీ విత్ రానా షో సెట్‌లో న‌టులు సుమంత్, నాగచైతన్య కలిసి పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సుమంత్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఫొటో అభిమానుల‌ను అల‌రించింది. రానా టీవీలో షో మొదటి ఎపిసోడ్‌లో సుమంత్‌, నాగ‌చైత‌న్య‌లే క‌నిపించ‌నున్నార‌ట‌. ఇక రెండవ ఎపిసోడ్‌లో అక్కినేని అఖిల్, రాజమౌళి తనయుడు కార్తికేయ క‌నిపిస్తార‌ట‌.

  • Loading...

More Telugu News