: భారత్ ఓడినందుకు.. రైలుకి ఎదురుగా వెళ్లి బంగ్లావాసి ఆత్మహత్య
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో భారత క్రికెట్ జట్టుకి వీరాభిమాని అయిన బంగ్లాదేశ్ కు చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం ఢాకాకు చెందిన బిద్యుత్(25) అనే అభిమాని వేగంగా వెళుతున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఈ ఘటనకు పాల్పడ్డాడని చెప్పారు. బిద్యుత్ షాంగ్ గేట్ ప్రాంతంలో చిరు వ్యాపారం చేసుకునే వాడని వివరించారు.