: గోరక్షణ కోసం సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రతిపాదన
దేశవ్యాప్తంగా ఉన్న గోశాలలకు ఫండింగ్ కోసం పెట్రోల్ పై సెస్ విధించాలంటూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన ప్రతిపాదన చేశారు. నిన్న నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 1962లో భారత్ పై చైనా దాడి చేసిన ఘటనను గుర్తు చేశారు. ఆ సమయంలో రక్షణ నిధి కోసం ఓ అప్పీల్ తీసుకొచ్చామని, ప్రస్తుతం దేశం ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోని హిందువులు, ముస్లింలు అన్ని మతాల వారు ఈ సెస్‌ను చెల్లించాల్సిందేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ... గోరక్షకులకు సర్టిఫికేషన్ ఇవ్వాలని అన్నారు. గోవుల కోసం అభయారణ్యం కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు.