: పాలస్తీనాకు ప్రత్యేక దేశంగా గూగుల్ గుర్తింపు
పాలస్తీనా ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రాంతం. స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్న భూభాగం. దీన్ని పాలస్తీనా టెరిటరీస్ అని పిలుస్తుంటారు. దీనికి ప్రత్యేక దేశంగా గుర్తింపునివ్వడానికి అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకం. కానీ అమెరికాకే చెందిన టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్ పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేసింది. మన భారత్ కు www.google.co.in ఎలా అయితే గూగుల్ యుఆర్ఎల్ చిరునామా ఇచ్చేసిందో .. అలానే పాలస్తీనాకు కూడా www.google.ps చిరునామాను ఖరారు చేసి అగ్రరాజ్య ధోరణికి భిన్నంగా వ్యవహరించింది.