: కాజల్ కళ్లకు గంతలు కట్టి... ఆభరణాలు అలంకరించిన రానా... ‘నేనే రాజు నేనే మంత్రి’ కొత్త టీజర్ అదుర్స్


టాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఉన్న‌ కాజల్ ఈ రోజు పుట్టిన రోజు వేడుక జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా ఆమె నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా నుండి ఓ ప్ర‌త్యేక‌ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రానా హీరోగా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ టీజ‌ర్‌లో కాజల్‌ కళ్లకు రానా గంతలు కట్టి ఆభరణాలు వేస్తాడు. అనంత‌రం ఆమె కళ్లకు క‌ట్టిన గంత‌లు తీసి దీపాల‌తో వెలిగిపోతున్న భ‌వ‌నంలోకి తీసుకెళ‌తాడు. ‘నా పేరు రాధా జోగేంద్ర. రాధ లేనిదే జోగేంద్ర లేడు’ అని రానా ఓ డైలాగ్ చెబుతాడు. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ లక్ష్మీ కల్యాణం సినిమాతో కాజ‌ల్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆమె న‌టిస్తోన్న‌ ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ఆమెకు 50 వ సినిమా. దీనికి కూడా తేజానే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం విశేషం.

  • Loading...

More Telugu News