: చంద్రబాబు, జగన్ లకు మోదీ ఫోన్.. మమత విషయం ఏమైందంటూ చంద్రబాబును ఆరా తీసిన ప్రధాని!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ను ఎంపిక చేశామని ఈ సందర్భంగా వీరికి మోదీ తెలిపారు. ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ... దళిత వ్యక్తిని రాష్ట్రపతిని చేయాలనే మోదీ ఆలోచన చాలా గొప్పదని అన్నారు. ఇదే సమయంలో, రాష్ట్రపతి ఎన్నిక అంశంలో మమతా బెనర్జీతో సంప్రదింపుల విషయాన్ని మోదీ ఆరా తీశారు. మమతతో సంప్రదింపుల బాధ్యతను ఎన్డీయే గతంలో చంద్రబాబుకు అప్పగించింది. మరోవైపు, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.