: 'ముస్లింలందరినీ చంపేస్తాను' అంటూ అరుస్తూ వ్యానుతో ఢీ కొట్టాడు!


వరుస దాడులతో లండన్ అట్టుడుకుతోంది. తాజాగా జరిగిన వ్యాన్ దాడిలో ఒక వ్యక్తి మృతి చెందడంతో పాటు, 10 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఈ దాడికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడ్డ వ్యక్తి... 'నేను ముస్లింలందరినీ చంపేస్తాను' అని అరుస్తూ పాదచారులను ఢీకొట్టినట్టు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ప్రార్థనలు చేస్తున్నవారిని దాడికి పాల్పడ్డ వ్యక్తి లక్ష్యంగా చేసుకున్నాడని చెప్పాడు. మసీదు చిన్నదిగా ఉండటంతో, అందులో సరిపోక చాలా మంది బయటే ప్రార్థనలు చేస్తున్నారని... వారిని లక్ష్యంగా చేసుకునే దాడి జరిగిందని చెప్పాడు. 

  • Loading...

More Telugu News