: ఇప్పటి వరకు 2 వేల మంది యువతులకు పెళ్లి చేశాడు.. ఆదర్శంగా నిలిచాడు!


గుజరాత్‌లో వజ్రాల వ్యాపారం చేసే మహేష్ ఎంతో మంది అమ్మాయిల‌ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆయ‌న‌ సుమారు 2000 మంది యువ‌తుల‌తో 'నాన్న' అని పిలిపించుకుంటున్నారు. ఈ ఏడాది ఆయన ఇప్ప‌టివ‌ర‌కు తండ్రిలేని 251 మంది యువతులకు తండ్రి స్థానంలో నిలబడి సామూహిక వివాహాలు జరిపించారు. దీంతో ఆయ‌న పేరు మ‌రోసారి దేశ వ్యాప్తంగా నిలిచింది.

వివ‌రాల్లోకి వెళితే, 2008లో మ‌హేష్ ఎంత‌గానో ప్రేమించే త‌న సోద‌రుడిని కోల్పోయాడు. ఆయన సోదరుడు ఈశ్వర్ సవానీ.. తన కూతుళ్లు మితుల, అమ్రుతాల పెళ్లి వేడుక‌ కోసం నగలు కొనేందుకు దుకాణానికి వెళ్లారు. అయితే, ఆ నగలకు గానూ బిల్లుని ఒకేసారి చెల్లించాల‌ని, లేకుంటే వాటిని ఇవ్వమని దుకాణదారుడు చెప్పాడు. దీంతో ఒక్కసారి అంత డబ్బు కట్టడం ఎలా అని టెన్షన్ పడ్డ ఈశ్వర్ కి గుండెపోటు వ‌చ్చి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

అనంతరం త‌న సోద‌రుడి కూతుళ్ల‌ వివాహాల‌ను మహేష్ జ‌రిపించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 2 వేల మంది యువతులకు కూడా పెళ్లిళ్లు జ‌రిపించారు. ఒక్కో యువతి పెళ్లికి దాదాపు రూ.4 లక్షలు చొప్పున ఖ‌ర్చుచేస్తున్నారు. అంతేకాదు తండ్రి కోల్పోయిన బాలికల కోసం ఓ స్కూలు నెల‌కొల్పి, ఉచితంగా విద్య అందిస్తున్నారు. మ‌రోవైపు సూరత్‌లో 238 పాఠశాలలు, 19 కాలేజీల్లోని విద్యార్థులకు ఆర్థిక‌ సాయం అందిస్తున్నారు.         

  • Loading...

More Telugu News