: వరుసగా నాలుగోరోజూ తగ్గిన పెట్రోల్ ధరలు
పెట్రోల్ ధరలను రోజువారీ సవరించడాన్ని ఈ నెల 16 నుంచి అమల్లో తీసుకురాగా, వరుసగా నాలుగోరోజూ ధరలు తగ్గాయి. సవరణ అనంతరం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.67.14గా, ముంబైలో రూ.75.88గా, కోల్ కతాలో రూ.67.37గా, న్యూఢిల్లీలో రూ.64.65గా ఉంది. డీజిల్ ధరలు చెన్నైలో లీటర్ రూ.56.89గా, ముంబైలో రూ.59.39గా, కోల్ కతాలో రూ.56.16గా, న్యూఢిల్లీలో రూ.56.16గా నిర్ణయించారు.
ధరలు చెక్ చేసుకోవడం ఎలా?
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఏ రోజుకారోజు తాజా ధరలను తెలుసుకోవచ్చు. అలాగే, RSP అని సెల్ ఫోన్ లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి మనకు కావలసిన పెట్రోల్ పంప డీలర్ కోడ్ ఎంటర్ చేసి 92249 92249 నంబర్ కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా తాజా ధరలను పొందవచ్చు. ఇక Fuel@IOC అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నా తాజా ధరల గురించి తెలుస్తుంది. ఇంకా 1800 2333 555 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు.