: కార్ ఇంజిన్ భాగంలోకి దూరి హడలెత్తించిన కింగ్ కోబ్రా... వీడియో చూసేయండి!
పది అడుగుల పొడవు. 4.6 కిలోల బరువుతో ఉన్న ఓ నల్లటి కింగ్ కోబ్రా (నాగు పాము) చైనాలో హడలెత్తించింది. ఓ కారు ఇంజిన్ భాగంలోకి దూరి భయపెట్టింది. దాన్ని బయటకు తీసేందుకు ముగ్గురు వ్యక్తులు ఎంతో శ్రమ పడ్డారు. చివరికి దాన్ని తీసుకెళ్లి అడవుల్లో విడిచి పెట్టారు. చైనాలోని యున్నన్ ప్రావిన్స్ ప్రాంతంలో జరిగిన దీన్ని ఓ వీడియోలో బంధించి అంతర్జాలంలో పోస్ట్ చేశారు.